పండగ చేసుకుంటున్న మెగా మేనల్లుడు


Sai Dharam Tej
Sai Dharam Tej

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా ప్రతీరోజు పండగ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది దాంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు . ప్రతీరోజు పండగే సెట్లో జాయిన్ అయ్యానని , షూటింగ్ సరదాగా సాగుతోందని నిజంగానే ప్రతీరోజు పండగే అని అంటున్నాడు మెగా మేనల్లుడు .

నిజమే ఈ సినిమా మెగా మేనల్లుడి కి ప్రతీ రోజు పండగే ఎందుకంటే మెగా కుటుంబం అంటే అమితంగా ఇష్టపడే దర్శకులు మారుతి ఈ సినిమాకు దర్శకుడు కావడం అలాగే సొంత చిత్ర నిర్మాణ సంస్థ లాంటి గీతా ఆర్ట్స్ 2 , యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కావడం అలాగే తనకు సుప్రీమ్ వంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చిన రాశి ఖన్నా ఇందులో హీరోయిన్ దాంతో సాయిధరమ్ తేజ్ కు నిజంగానే పండగలా అనిపిస్తోంది ఈ షూటింగ్ లో .