ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో మేగా మేన‌ల్లుడు!ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో మేగా మేన‌ల్లుడు!
ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లో మేగా మేన‌ల్లుడు!

లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త ఎనిమిది నెల‌లుగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా స్వైర విహారం చేస్తుండ‌టంతో కీల‌క రంగాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. ఇటీవ‌ల అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా అన్ని రంగాలు తిరిగి కార్య‌క‌లాపాలు ప్రారంభించినా సినిమా థియేట‌ర్లు రీఓపెకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తులు రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు థియేట‌ర్లు తెరుచుకుంటాయా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌ల 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేసుకోవ‌చ్చంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ శుక్ర‌వారం మూవీ థియేట‌ర్స్ రీఓపెన్ అయ్యాయి. ఎంతో కాలంగా థియేట‌ర్ల‌ని మిస్ అవుతున్న సెల‌బ్రిటీలు శుక్ర‌వారం మ‌ల్టీప్లెక్స్‌ల బాట‌ప‌ట్టారు. ఇందులో భాగంగా ప్రేక్ష‌కుల్ని సినిమా థియేట‌ర్ల‌కు ఆహ్వానిస్తూ మేగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ ఓ స్పెష‌ల్ వీ‌డియోని షేర్ చేశారు.

ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్ చేసుకుని ప్ర‌తీ ఒక్క‌రు థియేట‌ర్ల‌కు రావాల‌ని కోరుతూ ఓ వీడియో సందేశాన్ని అందించారు. ` చాలా కాలం త‌రువాత థియేట‌ర్ల‌కు రావ‌డం చాలా సంతోషంగా వుంది. వెండితెర‌పై సినిమాని చూడ‌ట‌మే నా దృష్టిలో ఓ అద్భుత‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. నాలాగే చాలా మందికి కూడా ఇలాంటి భావ‌నే వుంటుంద‌ని నాకు తెలుసు. రండి సినిమాని మ‌ళ్లీ సెల‌బ్రేట్ చేసుకుందాం. కాక‌పోతే థియేట‌ర్‌కు వ‌చ్చే ముందు మాస్కులు ధ‌రించండి. అలాగే చేతుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేసుకోండి` అని తెలిపారు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. సాయి‌ధ‌ర‌మ్‌తేజ్ త‌ర‌హాలోనే ద‌ర్శ‌కుడు మారుతి కూడా ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌కి వెళ్లారు.