మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ తో మెగా మేనల్లుడు


saidharam tej once again with disaster director

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ టైం అస్సలు బాగోలేదు ఎందుకంటే ఇప్పటికే వరుసగా అయిదు ప్లాప్ లను ఎదుర్కొన్నాడు అందునా అన్ని కూడా డిజాస్టర్ అనే మాట చాలా చిన్నది అంత ఘోరంగా ప్లాప్ అయ్యాయి అయిదు సినిమాలు కూడా . తిక్క , విన్నర్ , నక్షత్రం , జవాన్ , ఇంటలిజెంట్ ఇలా అయిదు సినిమాలు డిజాస్టర్ లు అయ్యాయి . అయినప్పటికీ మళ్ళీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడి తో మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా మేనల్లుడు దాంతో అతడి పై విమర్శలు వస్తున్నాయి .

ఇంతకీ డిజాస్టర్ ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ……. విన్నర్ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కళ్ళు బైర్లు కమ్మేలా చేసిన గోపీచంద్ మలినేని . గత ఏడాది సాయి ధరమ్ తేజ్ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో విన్నర్ అనే డిజాస్టర్ సినిమా వచ్చింది కట్ చేస్తే ఈ ఏడాది మేలో మళ్ళీ అతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మెగా మేనల్లుడు దాంతో మెగా మేనల్లుడి పై విమర్శలు ఎక్కువయ్యాయి . ఇప్పటికే కెరీర్ ఎటు వైపు వెళుతుందో అర్ధం కావడం లేదు ఇలాంటి సమయంలో హిట్ దర్శకుడి వెంట పడకుండా డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా ఏంటి ? అని ఆశ్చర్య పోతున్నారు మెగా ఫ్యాన్స్ .