తల్లిదండ్రుల విడాకులపై సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే ?


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల క్రితం విడిపోయారు ,ఎవరి బ్రతుకు వారిదే అన్నట్లుగా విడాకులు తీసుకున్నారు . అయితే ఈ విషయం పై తాజాగా స్పందించాడు సాయి ధరమ్ తేజ్ . 2011 లో మా అమ్మా – నాన్న ఇద్దరూ విడిపోయారు . అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంది . అమ్మా – నాన్న ఇద్దరూ కలిసి ఉండి గొడవ పడటం కంటే విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు.

అమ్మా – నాన్న విడిపోయినప్పటికీ నాన్న కూడా మా యోగ క్షేమాలు తెలుసుకుంటూనే ఉంటాడు అంటూ తల్లిదండ్రుల విడాకులపై స్పందించాడు మెగా మేనల్లుడు .ఈ విడాకుల విషయం ఫిలిం ఇండస్ట్రీ లోని కొంతమందికి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇలా ఓపెన్ అవ్వడం ద్వారా తెలియని వాళ్లకు కూడా తెలిసిపోయింది. చిత్రలహరి చిత్రంతో ఇటీవలే విజయం సాధించాడు సాయి ధరమ్ తేజ్ .