మహేష్ హీరోయిన్ విషయంలో కొత్త ట్విస్ట్

మహేష్ హీరోయిన్ విషయంలో కొత్త ట్విస్ట్
మహేష్ హీరోయిన్ విషయంలో కొత్త ట్విస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న 27వ చిత్ర విశేషాలను మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించిన సంగతి తెల్సిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆరోజు విడుదల చేసిన ప్రీ లుక్ అభిమానులను ఎంతగానో అలరించింది. మెడ మీద టాటూ, చెవికి పోగుతో ఉన్న మహేష్ ప్రీ లుక్ కు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి విభిన్నంగా సర్కారు వారి పాట అనే టైటిల్ ను నిర్ణయించారు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. మహేష్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాడు.

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తాడు. ఇలా సాంకేతిక నిపుణుల విషయంలో క్లారిటీ వచ్చింది కానీ ఈ చిత్ర హీరోయిన్ విషయంలో టీమ్ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మొదటినుండి ఈ సినిమా హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైందని వార్తలు వస్తున్నాయి.

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కియారా మరోసారి మహేష్ తో రొమాన్స్ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే మహేష్ తో చేయడం ఆమెకు ఇష్టమే అయినా తీరిక సలపని షెడ్యూల్స్, డేట్స్ విషయంలో గందరగోళంతో ఆమె ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని వెల్లండించలేదు. ఈలోగా మరో భామ పేరు తెరపైకి వచ్చింది. ఆమే దబంగ్ 3తో ఎంట్రీ ఇచ్చిన సాయీ మంజ్రేకర్. ఆమెను నిర్మాతలు అప్రోచ్ అయినట్లుగా తాజా సమాచారం. మరి చూడాలి ఇదైనా నిజమో కాదో.