`ఆది పురుష్‌`లో లంకాధిప‌తి క్యారెక్ట‌ర్ ఫిక్స్‌!


Saif alikhan as ravan in Prabhas's film adipurush
Saif alikhan as ravan in Prabhas’s film adipurush

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌నున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. `త‌న్హాజీ` ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. టి సీరీస్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో భూష‌న్ కుమార్‌, కృష్ణ‌కుమార్‌, ప్ర‌సాద్ సుతార్‌, రాజేష్ నాయ‌ర్‌  నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో క‌లియుగ రాముడిగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌నిపించ‌నుండ‌గా ఆయ‌న‌కు జోడీగా సీత పాత్ర‌లో కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఇందులో లంకాధిప‌తి రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించే అవ‌కాశం వుంద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రిగింది.

తాజాగా ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ మేక‌ర్స్ ఈ చిత్రంలోని కీల‌క పాత్ర కోసం సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. ఈ విష‌యాన్ని గురువారం సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వెల్ల‌డించారు. 7000 ఏళ్ల క్రితం అత్యంత తెలివైన ఓ రాక్ష‌సుడు వుండేవాడు` అంటూ ఆ పాత్రలో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే ఈ చిత్ర టైటిల్‌ని, టైటిల్ లోగోని చిత్ర బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

`ఆది పురుష్‌`లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌కు ధీటైన విల‌న్ దొర‌క‌డం ఆనందంగా వుంది. `త‌న్హాజీ` లో సైఫ్ న‌ట‌న న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. 7000  ఏళ్ల క్రింద‌ట ఉన్న ఓ తెలివైన రాక్ష‌సుడి స్వ‌భావం, తీరుతెన్నుల‌తో ఆదిపురుష్‌లో ఓ విల‌న్ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు తెలిపిన‌ప్ప‌టి నుంచి ఈ పాత్ర‌కు ఎవ‌రైనా స్టార్ హీరో కుదిరితే బాగుంటుంద‌నుకున్నాను. ఈ పాత్ర‌కు సైఫ్ ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోతార‌ని నా న‌మ్మ‌కం. ప్ర‌భాస్‌, సైఫ్ ల అన్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ ఎలా వుండ‌బోతోంద‌న్న‌ది ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నా అని నిర్మాత‌ల‌తో ఒక‌రైన భూష‌ణ్‌కుమార్ అన్నారు.