ఎన్టీఆర్ మూవీలో ప్ర‌భాస్ విల‌న్?

ఎన్టీఆర్ మూవీలో ప్ర‌భాస్ విల‌న్?
ఎన్టీఆర్ మూవీలో ప్ర‌భాస్ విల‌న్?

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన గ‌త కొన్ని రోజులుగా ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి.

స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై సంధిస్తున్న వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీ వుండ‌బోతోందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీతో త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు విల‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించే అవ‌కాశం వుంద‌ని తాజాగా వినిపిస్తోంది‌.

సైఫ్ అలీఖాన్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న 3డీ ఫిల్మ్ `ఆది పురుష్‌`లో రావ‌ణుడిగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో పాటు సైఫ్ మ‌రో తెలుగు చిత్రంలోనూ విల‌న్‌గా న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని, అది ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌ల సినిమా అని తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంత వ‌ర‌కు మేక‌ర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.