శైలజారెడ్డి అల్లుడు కష్టపడుతున్నాడు


shailaja reddy alludu facing re- recording problemరమ్యకృష్ణ శైలజారెడ్డి గా నటించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు , అక్కినేని నాగచైతన్యఅను ఇమ్మాన్యు యేల్ జంటగా నటించారు కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 31 న విడుదల చేయబోతున్నామని ఎప్పుడో ప్రకటించారు దర్శకులు మారుతి అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే సకాలంలో శైలజారెడ్డి అల్లుడు వస్తాడా ? అని అనిపిస్తోంది . ఎందుకంటే ఇంకా రీ రికార్డింగ్ పూర్తికాలేదు , ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు ,. అయితే రీ రికార్డింగ్ పూర్తి అయితే ఈనెల 31న సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు కానీ కేరళలో భారీ వర్షాలు , వరదలతో అస్తవ్యస్తమయింది దాంతో ఈ ఇబ్బంది వచ్చింది .

విడుదలకు మరో పది రోజుల గడువు ఉంది కాబట్టి మ్యాగ్జిమమ్ వర్క్ అయిపోతుంది ఎందుకంటే రెండు , మూడు రోజుల పని మాత్రమే మిగిలి ఉందట ….. ఆ పని సక్రమంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగస్టు 31న శైలజారెడ్డి అల్లుడు విడుదల అవుతాడు లేదంటే కష్టమే ! వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం పై మారుతి తో పాటుగా అక్కినేని నాగ చైతన్య కూడా భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక ఫ్లో చూసినా శైలజారెడ్డి అల్లుడు పెద్ద హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది ఎందుకంటే నాగార్జున నటించిన ” అల్లరి అల్లుడు ” లా కనిపిస్తోంది మరి .

English Title: shailaja reddy alludu facing re recording problem