ఓటీటీ ప్లాట్ ఫామ్‌తో `స‌లార్‌` టీమ్ చ‌ర్చ‌లు?

Salaars team in talks with top ott platform?
Salaars team in talks with top ott platform?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌లార్‌`. `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్త‌యింది.  వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు`సలార్`చిత్ర‌ బృందం ప్రకటించింది. దీనితో పాటు ప్రభాస్ నుంచి వచ్చే వేసవిలో 3 నెలల్లో బ్యాక్ టు బ్యాక్ 2 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. `ఆదిపురుష్` ఆగస్టు 11 న విడుదల కానుంది.

ఇదిలా వుంటే `కేజీఎఫ్` ఫేమ్  ప్రశాంత్ నీల్ `స‌లార్‌` చిత్రానికి  దర్శకత్వం వహిస్తుండ‌టం, పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామాగా `స‌లార్‌` తెర‌పైకి వ‌స్తుండ‌టంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం చుట్టూ ఉన్న భారీ హైప్‌ను దృష్టిలో పెట్టుకుని `సలార్` చిత్ర  బృందం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

అతి త్వరలో, `సలార్` అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం డీల్ చ‌ర్చ‌ల ద‌శ‌లో వుంది. వ‌న్స్ డీల్ ఫినిష్ అయితే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి ఏడాది క‌న్నా   ఎక్కువ సమయం ఉన్నప్పటికీ `సలార్` డిజిటల్, శాటిలైట్‌ మరియు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవాల‌ని చాలా సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. అందులో డిజిట‌ల్ హ‌క్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఇవ్వ‌బోతుడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని నిర్మాత విజయ్ కిరాగందూర్ అత్యంత భారీ స్థాయిలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.