స‌ల్మాన్‌ఖాన్ షాకింగ్ నిర్ణ‌యం!

స‌ల్మాన్‌ఖాన్ షాకింగ్ నిర్ణ‌యం!
స‌ల్మాన్‌ఖాన్ షాకింగ్ నిర్ణ‌యం!

క‌రోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని వ‌ణికిస్తోంది. టాలీవుడ్‌లో చామంది సెల‌బ్రిటీలు దీని బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లోనూ బిగ్‌బి ఫ్యామిలీ స‌భ్యులు క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల డా. రాజ‌శేఖ‌ర్ క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా క‌రోనా స‌ల్మాన్‌ఖాన్ సిబ్బందికి  సోకింది. దీంతో స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు.

స‌ల్మాన్‌ఖాన్ కారు డ్రైవ‌ర్‌తో పాటు వ్య‌క్తిగ‌త సిబ్బందిలో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ముంబైలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న స‌ల్లూ భాయ్ త‌న ఫ్యామిలీతో క‌లిసి 14 రోజుల పాటు క్వారెంటైన్‌కి ప‌రిమితం కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా షూటింగ్‌లు తిరిగి పునః ప్రారంభం కావ‌డంతో స‌ల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ తో పాటు `రాధే` మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

`రాధే` చిత్రానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిశా ప‌టాని హీరోయిన్ గా న‌టిస్తోంది. గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీగా ఇటీవ‌ల స‌ల్మాన్ – ప్ర‌భుదేవా క‌ల‌యిక‌లో `ద‌బాంగ్ 3` చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ఈ మూవీ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న `రాధే` మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.