అల వైకుంఠపురములో హిందీ రీమేక్: సూపర్ స్టార్ ఆసక్తి


అల వైకుంఠపురములో హిందీ రీమేక్: సూపర్ స్టార్ ఆసక్తి
అల వైకుంఠపురములో హిందీ రీమేక్: సూపర్ స్టార్ ఆసక్తి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా అక్కడి నుండి ఎక్కడా వెనక్కి తిరిగి చూసింది లేదు. రోజురోజుకీ కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతూ వెళ్లడంతో నెమ్మదిగా అల వైకుంఠపురములో హిట్ స్టేటస్ నుండి సూపర్ హిట్ అక్కడి నుండి బ్లాక్ బస్టర్ ఆపై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఈ చిత్రం 120 కోట్ల ప్లస్ షేర్ సాధించడం విశేషం. బాహుబలి 2 తర్వాత ఈ చిత్రమే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు యూఎస్ లో కూడా ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది. 3 మిలియన్ ప్లస్ వ్యూస్ తో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది.

అల వైకుంఠపురములో సక్సెస్ అటు బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. తెలుగు సినిమాలపై హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈ మధ్య ఎక్కువైంది. ఇక్కడ మంచి సినిమాలు ఏవైనా రీమేక్ కు ఛాన్స్ ఉందేమోనని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో రీమేక్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ రీమేక్ హక్కులు తమ వద్దనే ఉంచుకున్నారు. తామే ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రంలో సల్మానే నటిస్తాడా లేక ఇంకెవరైనైనా అనేది చూడాలి.

అల్లు అరవింద్ ఈ మధ్య బాలీవుడ్ సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు. తెలుగులో జెర్సీ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో నిర్మిస్తోన్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి దిల్ రాజు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.