సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నాడా ?


Salman Khan
Salman Khan

సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సంచలన కామెంట్ చేసింది హాట్ భామ జరీన్ ఖాన్ . వీర్ సినిమాలో జరీన్ ఖాన్ కు హీరోయిన్ గా అవకాశం ఇచ్చింది సల్మాన్ ఖాన్ అన్న విషయం తెలిసిందే . దాంతో ఈ భామకు సల్మాన్ ఖాన్ అంటే ఎనలేని ప్రేమ . సల్మాన్ పై మరీ ఎక్కువ ప్రేమ్ చూపిస్తూ మీడియాకు దొరికిపోతుంది కాబట్టే ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే జరీన్ ఖాన్ కు పెళ్లి మీద నమ్మకం లేదట ! ఎందుకంటే ప్రేమించుకుంటున్నారు , పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత విడిపోతున్నారు ఇక ప్రేమ , పెళ్ళిలో అర్ధం ఏముంది అని అంటోంది జరీన్ ఖాన్ . ఇక సల్మాన్ ఖాన్ కూడా అంతే ……. ఈ హీరోకు 53 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు కాకపోతే ఎఫైర్ లు మాత్రం బాగానే నడిపిస్తున్నాడు . ఇక ఈ ఇద్దరి పెళ్లి గురించి వస్తే ….. జస్ట్ జోక్ కోసం సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ నవ్వేస్తోంది ……. లోగుట్టు ఏంటో !