గ‌డ్డి తిన్న బాలీవుడ్ హీరో!

గ‌డ్డి తిన్న బాలీవుడ్ హీరో!
గ‌డ్డి తిన్న బాలీవుడ్ హీరో!

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. క‌రోనానాఇ క‌ట్ట‌డి చేసే చ‌ర్య‌ల్లో భాగంగా , దేశ ప్ర‌జ‌ల‌ను సుర‌క్షింగా వుంచ‌డంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే లాక్‌డౌన్ ని 21 రోజుల పాటు విధించారు. దీంతో ప్రతీ ఒక్క‌రూ ఇంటికే ప‌రిమిత‌మైపోయారు.

సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంతా ఇంటికే ప‌రిమిమ‌య్యారు. ఖాలీ టైమ్ ఇంత‌కు ముందు కంటే ఎక్కువ‌గా ల‌భించ‌డంతో సెల‌బ్రిటీల‌కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. దీంతో కొంత మంది విచిత్రాస‌నాలు వేస్తూ భ‌య‌పెట్టిస్తుంటే మ‌రి కొంత మంది వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు. కొంత మంది వంట‌లు చేస్తున్నారు.

స‌ల్మాన్‌ఖాన్ మాత్రం త‌న పెంపుడు జంతువుల‌తో గ‌డిపేస్తున్నాడు. లాక్‌డౌన్ విధించిన ద‌గ్గ‌రి నుంచి ఫామ్ హౌజ్‌కే ప‌రిమిత‌మైన స‌ల్మాన్‌ఖాన్ అక్క‌డ వున్న త‌న హార్స్‌తో కాల‌క్షేపం చేస్తున్నాడు ఉద‌యం గ‌డ్డి తినిపిస్తూ త‌ను కూడా తిన‌డం నెటిజ‌న్స్‌ని షాక్ కు గురిచేసింది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అంటూ స‌ల్మాన్ పోస్ట్ పెట్ట‌డం, ఆ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

Breakfast with my love…

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Credit: Instagram