స‌ల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్ నుంచి త‌ప్పుకోవాల్సిందేనా?


Salman Khan quit to bigboss show shortly
Salman Khan quit to bigboss show shortly

బాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్లుగా బిగ్ బాస్ రియాలిటీ షో ర‌న్న‌వుతున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత దేశ‌లోని ప్ర‌ధాన భాష‌ల‌కు పాకిన ఈ రియాలిటీ షో దేశ వ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ.. ఇలా అన్ని భాష‌ల‌కు విస్త‌రించిన ఈ షోకు ఇండియాలో తొలి హోస్ట్ స‌ల్మాన్‌ఖాన్‌. గ‌త కొన్నేళ్లుగా ఈ షోను విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నారాయ‌న‌. అయితే ఈ షో నుంచి స‌ల్మాన్‌ఖాన్ ప‌క్క‌కు త‌ప్పుకునే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని, ఇక ఈ సీజ‌న్ త‌రువాత స‌ల్మాన్ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ షో నుంచి స‌ల్మాన్‌ఖాన్ త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని, ప్ర‌స్తుత సీజ‌న్ ఎండింగ్‌లో ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే స‌ల్మాన్ బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి త‌నకు తానుగా త‌ప్పుకోవాల‌నుకోవ‌డం లేద‌ని, అత‌ని తండ్రి స‌లీమ్‌ఖాన్‌, త‌ల్లి స‌ల్మాఖాన్ ఒత్తిడి కార‌ణంగానే స‌ల్మాన్‌ఖాన్ ఈ రియాలిటీ షో నుంచి త‌ప్పుకునే అవకాశం వుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త కొంత కాలంగా బిగ్ బాస్ షో కార‌ణంగా స‌ల్మాన్ ఆరోగ్యం దెబ్బ‌తింద‌ని, త‌ను ఇలాగే ఈ షోను కంటిన్యూ చేస్తే అత‌ను అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయ‌ని, ఆ కార‌ణంగానే స‌ల్మాన్‌ని బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోమ‌ని కుటుంబ స‌భ్యులు చాలా కాలంగా కోరుతున్నార‌ట‌.

స‌ల్మాన్ ఈ షో కార‌ణంగా ఉద్రేకానికి లోన‌వుతున్నార‌ని, షోలో జ‌రుగుతున్న ర‌చ్చ కార‌ణంగా వారిని హెచ్చ‌రించే క్ర‌మంలో స‌ల్మాన్ అస‌హ‌నానికి గుర‌వుతూ త‌న ఆరోగ్యాన్ని అల‌క్ష్యం చేస్తున్నాడ‌ని ఆయ‌న‌ త‌ల్లిదండ్రులు స‌లీమ్ ఖాన్‌, స‌ల్మాఖాన్ వాపోతున్నార‌ని బాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ `ద‌బాంగ్‌-3` ఈ నెల 20న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాక‌లంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోసారి ఇన్స్‌పెక్ట‌ర్ చుల్‌బుల్ పాండేగా స‌ల్మాన్‌ఖాన్ త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకోబోతున్నాడు. ప్ర‌భుదేవా రూపొందిస్తున్న ఈ సినిమా ద్వారా న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ కూతురు సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో స‌ల్మాన్‌ఖాన్ ప్రియురాలిగా  సాయి మంజ్రేక‌ర్ క‌నిపించ‌నుంద‌ని తెలిసింది.