150 కోట్ల దిశగా సల్మాన్ భారత్


సల్మాన్ ఖాన్ నటించిన భారత్ 5 రోజుల్లోనే 150 కోట్ల మార్క్ ని అందుకుంది . జూన్ 5 న రంజాన్ సందర్బంగా విడుదలైన భారత్ చిత్రానికి ఆశించిన స్థాయిలో రివ్యూస్ రాలేదు అలాగే టాక్ కూడా అంతగా బాగోరాలేదు కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్ళని సాధిస్తోంది భారత్ . మొదటి రోజున 42 కోట్లకు పైగా వసూల్ చేసి సల్మాన్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది .

ఇక వరుసగా రెండో రోజు , మూడో రోజు , నాల్గో రోజు , అయిదవ రోజు అనే తేడా లేకుండా మంచి వసూళ్లు సాధించడంతో 5 రోజుల్లోనే 150 కోట్ల మార్క్ ని అందుకుంది .సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది . అలాగే హాట్ భామ దిశా పటాని ఐటెం సాంగ్ లో మెరిసింది . భారత్ చిత్రం కు టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు వస్తుండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు సల్మాన్ ఖాన్ .