లిప్ లాక్ చేయాలంటే ఇబ్బందట


లిప్ లాక్ సీన్లు అలాగే ఇంటిమేట్ సీన్లు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . హీరోయిన్ లను ప్రేమించడంలో వాళ్ళని తన వెంట పడటంలో మాస్టర్ డిగ్రీ చేసిన ఈ హీరో , వరుసగా గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే ఈ హీరో లిప్ లాక్ , ఇంటిమేట్ సీన్ల గురించి ఇబ్బంది గురించి చెబుతున్నాడంటే విరగబడి నవ్వడం ఖాయం .

అయితే సల్మాన్ చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉందిలే ! తెరమీద అవి చేయడం నాకు ఇబ్బంది అని అంటున్నాడు అంతేకాదు నిజ జీవితంలో చేయడం ఇబ్బంది అని చెప్పలేదు . రీల్ లైఫ్ ని పక్కన పెడితే రియల్ లైఫ్ లో బోలెడు మందితో రొమాన్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు సల్మాన్ . అయితే పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు . పెళ్లి వద్దు ప్రియురాలు ముద్దు అని అంటున్నాడు . పెళ్లి చేసుకోడట కానీ పిల్లలు మాత్రం కావాలట సల్మాన్ ఖాన్ కు . ఈ హీరో నటించిన భారత్ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది . ఇక ఇందులో మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ నటించింది .