రేర్ ఫీట్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన స‌ల్మాన్‌ఖాన్!

Salman khan wraps up antim in just 60 days
Salman khan wraps up antim in just 60 days

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్లూ భాయ్ స‌ల్మాన్ ఖాన్ రేర్ ఫీట్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా ఫిట్ నెస్‌తో అద‌ర‌గొడుతున్న స‌ల్మాన్‌ఖాన్ తాజా చిత్రంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `అంతిమ్‌`. సిక్కు పోలీస్ అధికారి పాత్ర‌లో త‌ల‌పాగా ధ‌రించి.. చేతికి క‌డెంతో సిక్కు యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు.

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్ స‌సొంత నిర్మాణ సంస్థ ఎస్‌కెఎఫ్ నిర్మిస్తోంది. జీ5లో వ‌చ్చిన మ‌రాఠీ క్రైమ్ డ్రామా `మున్షీ` కి కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వాస్త‌వ్‌` చిత్రంతో సంచ‌ల‌నం సృష్టించిన మ‌హేష్ మంజ్రేక‌ర్ కొంత విరామం త‌రువాత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది.

ఈ చిత్రాన్ని కేవ‌లం 60 రోజుల్లోనే పూర్తి చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ కేవ‌లం ఈ చిత్రం కోసం 30 నుంచి 35 రోజుల మాత్ర‌మే కేటాయించార‌ట‌. గ‌త ప‌దేళ్ల‌లో స‌ల్మాన్ న‌టించిన చిత్రం ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో పూర్తి కావ‌డం విశేషంగా చెబుతున్నారు. ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ప్యాచ్ వ‌ర్క్‌ని రెండు రోజుల్లో పూర్తి చేయ‌బోతున్నారు. దీంతో అత్యంత త‌క్కువ రోజుల్లో పూర్తిచేసిన చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించ‌నుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో వున్న ఈ చిత్రాన్ని జూన్ విడుద‌ల చేస్తార‌ట‌. ఇందులో స‌ల్మాన్ సోద‌రి అర్పితాఖాన్ భ‌ర్త ఆయుష్‌శ‌ర్మ విల‌న్‌గా న‌టించారు.