సల్మాన్ భారత్ 4 రోజుల వసూళ్లు


సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ నాలుగు రోజుల్లో 122 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . జూన్ 5 న రంజాన్ సందర్బంగా భారీ ఎత్తున విడుదలైన భారత్ మొదటి రోజున 42. 30 కోట్ల ని వసూల్ చేసి సల్మాన్ ఖాన్ కు బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది . రెండో రోజున 31 కోట్లు , మూడో రోజున 22. 20 కోట్లని నాలుగో రోజున 26. 70 కోట్లని వసూల్ చేసింది . దాంతో నాలుగు రోజుల్లో 122 కోట్ల 22 లక్షలను వసూల్ చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు .

సల్మాన్ ఖాన్ నటించిన గత చిత్రాలు దారుణమైన పరాజయం పొందడంతో భారత్ పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . అయితే రంజాన్ సందర్బంగా విడుదల కావడంతో పాటుగా బాలీవుడ్ లో సరైన సినిమా కూడా ఏది లేకపోవడంతో భారత్ కు కలిసొచ్చింది . ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా మంచి వసూళ్ల నే సాధించనుంది భారత్ .