సామజవరగమన సునామి ఇది


samajavaragamana breaking records in youtube
samajavaragamana breaking records in youtube

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెల్సిందే. సాధారణంగా ఏదైనా సినిమా విడుదలకు నెల రోజుల ముందు తొలి పాటను విడుదల చేస్తారు. కానీ ఈ చిత్రానికి మాత్రం చాలా ముందే, దాదాపు మూడు నెలలు ముందుగా తొలి పాట “సామజవరగమన”ను విడుదల చేసేసారు.

ఇంత ముందు విడుదల చేయడం సంగతి పక్కనపెడితే ఈ పాట యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండే రోజుల్లో ఈ పాట కోటి వ్యూస్ దాటేసింది. దాంతోపాటు అప్పుడే 400K+ లైక్స్ సాధించింది. లైక్స్ పరంగా ఇప్పటికే ఇంత త్వరగా ఇన్ని లైక్స్ సాధించిన తెలుగు పాట మరొకటి లేదు.

సీతారామశాస్త్రి అద్భుతమైన భావుకతకు, థమన్ సంగీతం, సిద్ శ్రీరామ్ గానం తోడై ఈ పాట సరికొత్తగా నిలిచింది. ట్యూన్ చాలా క్యాచీగా ఉండడంతో యూత్ దీనికి బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్ పరంగా మంచి స్టార్ట్ లభించిందని చెప్పాలి.