సామజవరగమనా.. నీ సంచలనాలు ఆపతరమా!


samajavaragamana crosses 30 million views in youtube
samajavaragamana crosses 30 million views in youtube

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో.. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే బోలెడంత హైప్ వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్స్ కు అదిరిపోయే స్టార్ట్ లభించింది. సెప్టెంబర్ 27న యూట్యూబ్ లో ఈ పాట మొదటి సింగిల్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే.

సామజవరగమనా.. పేరుతో విడుదలైన ఈ పాట విడుదలైన రోజు నుండే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాట ఇక వెనుతిరిగి చూసింది లేదు. ఇప్పటికీ ఈ పాట రోజుకి లక్షల్లో వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈరోజుకి సామజవరగమనా 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను చేరుకుందంటే అర్ధం చేసుకోండి ఎంత పెద్ద హిట్ అయిందో.

థమన్ స్వరకల్పనలో సీతారామశాస్త్రి రచనలో సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట పాడారు. రొమాంటిక్ మెలోడీ అయిన ఈ పాట యూత్ కి ఇన్స్టంట్ గా నచ్చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదల కానుంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాలో నివేద పేతురాజ్, సుశాంత్, నవదీప్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.