అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసాడు


అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసాడు
అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమాకు లేనంతగా అల వైకుంఠపురములో సినిమా కోసం కష్టపడుతున్నాడు. కేవలం నటించేసి తన బాధ్యత అయిపోయింది అనుకోకుండా ఈ సినిమాకు ఏ విధంగా ప్రమోషన్ చేయాలి, ఎక్కడ షూటింగ్ చేయాలి వంటివన్నీ బన్నీనే స్వయంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఈ చిత్రంలో సామజవరగమన సాంగ్ ను రిలీజ్ డేట్ కు చాలా ముందరే విడుదల చేసేసారు. దీని వెనుక బన్నీ ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ డిసెంబర్ నుండే ప్రమోషన్స్ ను చేద్దామని భావిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం ముందరే విడుదల చేయమని పట్టుబట్టాడట. దానివల్ల ఈ సినిమాకు ఎంత లాభం చేకూరిందో తర్వాత టీమ్ మొత్తానికి తెలిసొచ్చింది. ఎందుకంటే సామజవరగమన అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నటినీ తిరగరాస్తూ వెళ్ళింది. ఇప్పుడు ఈ పాట 100 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. మరే సౌత్ సాంగ్ కు ఇంత ఆదరణ రాకపోవడం విశేషం.

ఈ సాంగ్ వల్ల అల వైకుంఠపురములో పై బజ్ కూడా బాగా వచ్చేసింది. బిజినెస్ పరంగా కూడా అల వైకుంఠపురములో చిత్రానికి ఫుల్ హైప్ వచ్చింది. సామజవరగమన తర్వాత వచ్చిన రాములో రాముల పాట కూడా అంతే రేంజ్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఇంతలా ఈ రెండు పాటలు హిట్ అవ్వడానికి మళ్ళీ ప్రధాన కారణం అల్లు అర్జునే. తనే మామూలు ఎప్పుడూ చేసేలా లిరికల్ వీడియో కాకుండా మ్యూజికల్ వీడియో చేయమని కూడా సలహా ఇచ్చింది అల్లు అర్జునే.

అంతే కాకుండా ఏ వీడియో ఎప్పుడు విడుదల చేయాలన్నది కూడా ప్లాన్ చేసాడు. ఇంతలా బన్నీ ఓన్ చేసుకున్నాడు కాబట్టే సంక్రాంతికి అల వైకుంఠపురములో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయన్న సంకేతాలు అందుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న అల వైకుంఠపురములో విడుదల కానున్న విషయం తెల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్, మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చినబాబు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Credit: Twitter