సామజవరగమన.. మొదటికే మోసం వస్తుందా?


samajavaragamana song shoot in exotic locations
samajavaragamana song shoot in exotic locations

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే చాలా స్పెషల్ గా నిలిచిపోయే పాటల్లో చాలా తక్కువ కాలంలోనే సామజవరగమన చేరిపోయింది. ఈ పాట విన్నప్పటినుండే శ్రోతలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కేవలం యూట్యూబ్ లోనే ఈ పాట 75 మిలియన్ వ్యూస్ తెచ్చుకుందంటే ఎంత పెద్ద హిట్ అయిందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఇంకా తెరకెక్కించని పాటలు ఇలా వైరల్ అయిపోతే ఆ అంచనాలు అందుకునేలా ఎలా తెరకెక్కించాలా అన్న డౌట్స్ మేకర్స్ కు కలగడం సహజం. సాధారణంగా ఈ పాట వింటే ప్రియుడు, ప్రేయసిని తనను లెక్కచేయమని పాడే పాట. సందర్భం చాలా సింపుల్ గా ఉన్నా సీతారామశాస్త్రి తన భావుకతతో ఈ పాటలో మ్యాజిక్ చేసాడు. ఇలాంటి సందర్భానికి మాంటేజ్ షాట్స్ తో సరదాసరదాగా వెళ్లిపోయేలా పాటను షూట్ చేయవచ్చు.

అయితే త్రివిక్రమ్ అండ్ కో ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యాక ప్లానింగ్ మొత్తం మార్చేసారట. ఈ పాటను షూట్ చేయడానికి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఇప్పటివరకూ ఎవరూ షూట్ చేయని లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. విజువల్ గా బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేసారు. అయితే విజువల్ గా మ్యాజిక్ చేయడం ఓకే కానీ ఇలాంటి లొకేషన్స్ లో డ్యాన్స్ నంబర్స్ పెట్టి షూట్ చేయడం వల్ల పాటలోని సోల్ క్యారీ అవుతుందా, ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుందా అని కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి త్రివిక్రమ్ పాటల పిక్చరైజేషన్ మీద అంత శ్రద్ధ పెట్టట్లేదు అనిపిస్తోంది. అరవింద సమేతలో పెనీవిటి సాంగ్ వినడానికి అద్భుతంగా ఉంటే ఆ సాంగ్ పిక్టరైజ్ చేసిన విధానం మీద విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు సామజవరగమన అంతకంటే పెద్ద హిట్ అయింది. ఇలాంటి పాటను ఎలా తెరకెక్కిస్తాడోనని బన్నీ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. మరోవైపు అల వైకుంఠపురములో మూడో పాట ఈ వారంలో విడుదలవుతుందని అంటున్నారు. కానీ దీనిపై అధికారిక సమాచారం ఏం లేదు.