తప్పులు చేసానని ఒప్పుకున్న సమంత


Samantha
Samantha

అక్కినేని కోడలు సమంత ఎట్టకేలకు నేను కూడా తప్పులు చేసానని ఒప్పుకుంది . అయితే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడుతున్నానని , ఆ తప్పులు ఓ గుణపాఠమని చెబుతోంది . ఓటమి నుండే విజయం వైపు పయనిస్తామని , అయితే తప్పులు చేసినప్పుడు , ఓటమి ఎదురైనప్పుడు భయపడిపోకుండా ధైర్యంగా నిలదొక్కుకున్నప్పుడే అసలు సిసలైన విజయమని అంటోంది ఈ భామ .

తాజాగా సమంత ఓ బేబీ అనే చిత్రంలో నటించింది , ఈ సినిమా జూలై 5 న విడుదల అవుతోంది దాంతో మీడియా ముందుకు వచ్చిన సమంత తన తప్పుల గురించి వాటినుండి ఎలా బయటపడిందో అన్న విషయాన్ని గురించి చెప్పింది . మానవ జీవితంలో తప్పులు చేయడం కామన్ అయితే మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేయడం మాత్రం తగదు అని హితువు పలుకుతోంది . అక్కినేని కోడలు అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు సమంత .