ఎన్టీఆర్ తో ఇరిటేషన్ – సమంత

Samantha Akkineni
ఎన్టీఆర్ తో ఇరిటేషన్ – సమంత

అక్కినేని సమంత ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్ళైన తర్వాత విభిన్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్న సమంత రీసెంట్ గా లక్ష్మి మంచు హోస్ట్ గా ప్రారంభమైన ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అందరూ తనను స్క్రిప్ట్స్ అద్భుతంగా సెలెక్ట్ చేసుకుంటావని పొగుడుతుంటారు అయితే అందులో నా అదృష్టం 75 శాతం ఉంటుంది. ఉదాహరణకు రామ్ చరణ్, సుకుమార్ ఉన్నారనే రంగస్థలం సినిమాను ఓకే చేసేసాను, అయితే అంత మంచి స్క్రిప్ట్ నాకు రావడం నా అదృష్టమే కదా. అలా నా చాలా హిట్స్ అదృష్టం వల్ల వచ్చినవే అని చెప్పుకొచ్చింది.

ఇక డ్యాన్స్ విషయం గురించి మాట్లాడుతూ “ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే చాలా ఇరిటేషన్. నేను చాలా కష్టపడి, మేకప్ అంతా పోగొట్టుకుని చెమటలు చిందిస్తూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎన్టీఆర్ సెట్స్ కు రాగానే స్టెప్ ఏంటని చాలా కూల్ గా అడుగుతారు, ఒకసారి చూడగానే చేసేద్దాం అంటారు. కనీసం స్టెప్ ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయరు. నాకు అది చూడగానే ఇరిటేషన్ వచ్చేస్తోంది. నేనింత కష్టపడుతుంటే, ఆయన కష్టమైన స్టెప్స్ ను కూడా ఈజీగా వేసేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది” అంది సమంత.