స‌మంత‌కు ద‌క్కిన అరుదైన ఘ‌న‌త‌!


స‌మంత‌కు ద‌క్కిన అరుదైన ఘ‌న‌త‌!
స‌మంత‌కు ద‌క్కిన అరుదైన ఘ‌న‌త‌!

స్టార్ హీరోయిన్‌ అక్కినేని స‌మంత అరుదైన ఘ‌న‌త‌ని సాధించింది. వివాహం త‌రువాత నుంచి త‌న పంథా మార్చుకుంది. క‌మ‌ర్షియ‌ల్  క‌థానాయిక‌గా న‌టించ‌డం త‌గ్గించి న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించ‌డం మొద‌లుపెట్టింది. అలా ఆమె న‌టించిన రంగ‌స్థ‌లం, యుట‌ర్న్‌, ఓబేబీ చిత్రాలు స‌మంత నిర్ణ‌యానికి మ‌రింత బ‌లాన్నిచ్చాయి.

దీంతో త‌న కెరీర్‌ని స‌రికొత్త‌గా మ‌లుచుకోవ‌డం మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగానే స‌మంత మ‌రో కొత్త అడుగు వేస్తోంది. అదీ డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన `ది ఫ్యామిలీమ్యాన్` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా `ది ఫ్యామిలీమ్యాన్ 2` రూపొందుతోంది. ఈ సంచ‌ల‌న సిరీస్ ద్వారా స‌మంత డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇదిలా వుంటే ఈ సీరీస్ ద్వారా ఏ స్టార్ హీరోయ‌న్‌కు ద‌క్క‌ని అరుదైన ఘ‌న‌త‌ని స‌మంత సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న అమెజాన్ ప్రైమ్‌‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం మేక‌ర్స్ స‌మంత ఎమోజీని ప్ర‌త్యేకంగా క్రియేట్ చేయించి వాడుతున్నారు. ఇలా చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు కొంత మంది ప్ర‌భాస్ లాంటి హీరోల‌కు మాత్ర‌మే చూశాం. కానీ ఓ స్టార్ హీరోయిన్‌కు ఈ త‌ర‌హా ఘ‌న‌త ద‌క్క‌డం దేశంలో ఇదే మొద‌టి సారి కావ‌డంతో స‌మంత అరుదైన ఘ‌న‌త‌ని సాధించిన‌ట్టుగా చెబుతున్నారు.