స‌మంత‌కే షాకిచ్చిన నెటిజ‌న్‌!


స‌మంత‌కే షాకిచ్చిన నెటిజ‌న్‌!
స‌మంత‌కే షాకిచ్చిన నెటిజ‌న్‌!

స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి ముద్దుల కోడ‌లు స‌మంత‌కు ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ పోస్ట్‌ని డెలిట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌పంచం కుగ్రామంగా మారిపోయింది. ఏది ఎక్క‌డ జ‌రిగినా క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌టికి వ‌చ్చేస్తోంది.

అయితే దీని కార‌ణంగా కొన్ని చెడుప‌స‌నులు కూడా జ‌రుగుతున్నాయి. వ్య‌క్తిగ‌త స‌మాచారం కూడా బ‌య‌టికి వ‌చ్చేస్తోంది. ఇదే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌ముఖుల్ని, సామాన్యుల్ని క‌లవ‌రానికి గురిచేస్తోంది. తాజాగా స‌మంత విష‌యంలోనూ అదే జ‌రిగింది. స‌మంత చెన్నై‌లోని స్టెల్లామేరీ కాలేజీలో బీకాం‌ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రొవిజ‌న‌ల్ స‌ర్టిఫికెట్‌ని ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌డ‌మే కాకుండా దీన్ని స‌మంత‌కు ట్యాగ్ చేశాడు.

దీంతో షాక్ తిన్న స‌మంత `ఇది మీరు ఎలా సంపాదించారు? ` అని ప్రశ్నించింది. అయితే సామ్ రిప్లై ఇచ్చిన వెంట‌నే స‌ద‌రు నెటిజ‌న్  త‌ను చేసిన పోస్ట్‌ని వెంట‌నే డిలిట్ చేశాడు. అప్ప‌టికే చాలా మంది సామ్ డిగ్రీ స‌ర్టిఫికెట్‌ని సేవ్‌ చేసేయ‌డంతో నెట్‌లో వైర‌ల్‌గా మారింది. చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీలో 2007లో బీకాం పూర్తి చేశారు. ఫ‌స్ట్ క్లాస్‌లో పాసైంది.