అమ‌ల – స‌మంత వంట చేయ‌రా?

అమ‌ల - స‌మంత వంట చేయ‌రా?
అమ‌ల – స‌మంత వంట చేయ‌రా?

అక్కినేని ఫ్యామిలీలో ఇద్ద‌రికి వంటి రాదు. మ‌రో ఇద్ద‌రికి వంటి బాగా తెలుసు. పాక శాస్త్రంలో వారికి మంచి ప్రావీణ్యం వుంది కూడా ఇంత‌కీ వంటి వ‌చ్చిన ఇద్ద‌రు ఎవ‌రు? వ‌ంట రాని వారు ఎవ‌రు?.. వంట వ‌చ్చిన వారు హీరో అక్కినేని నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు అక్కినేని నాగ‌చ‌తైన్య‌. ఇక వంట రాని వాళ్లెవ‌రో అర్థ‌మైంద‌నుకుంటాను.

య‌స్. అక్కినేని అమ‌ల‌, అక్కినేని స‌మంత‌. ఈ ఇద్ద‌రికి వంట రాదంటా.  ఈ విష‌యాన్ని స్వ‌యంగా అక్కినేని అమ‌ల ఓ మీడియా సంస్థ‌తో వెల్ల‌డించారు. ఇంట్లో ఎవ‌రు వంట‌ చేస్తార‌ని, మీరు కుటుంబ స‌భ్యుల కోసం వంట చేస్తారా అని అడిగితే అమ‌ల పై విధింగా స్పందించారు. ఇంట్లో నాగార్జున  మంచి కుక్ అని, అత‌నుండ‌గా వంట చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని చెప్పుకొచ్చింది.

ఇదిలా వుంటే అక్కినేని నాగ‌చైత‌న్య కూడా మంచి పాక‌శాస్త్ర ప్ర‌వీణుడ‌ని చాలా సంద‌ర్భాల్లో స‌మంత వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అంటే అక్కినేని ఫ్యామిలీలో ఇంద‌రు పాక‌శాస్త్ర ప్ర‌వీణులున్నార‌న్న‌మాట.