నిజంగానే మాయ చేసింది ఆ జంట…


Samantha Naaga Chaitanya Marriage Day
Samantha Naaga Chaitanya Marriage Day

అక్కినేని కుటుంబం లో మరిచిపోలేని సంఘటన ‘నాగ చైతన్య అక్కినేని’ మరియు ‘సమంత అక్కినేని‘ ల పెళ్లి రోజు. నిజంగానే ఆ జంట ప్రతి తెలుగు వారి మనసులు దోచేశారు.. మొదటగా ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్’ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా మనల్ని మాయ చేసిన ఆ జంట పెళ్లి రోజు రేపు.

మరి రెండవ సంవత్సర పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆ జంట కి ముందు రోజే ఫ్యాన్స్ అందరి తరుపున ట్విట్టర్ లో తెగ హడావిడి చేస్తున్నారు విషెస్ పంపుతూ. నిజానికి ఆ జంట కి వస్తున్న విషెస్ చూస్తుంటే ఒక్క అక్కినేని అభిమానులకే కాదు అందరికి కనుల విందుగా ఉంది అని అంటున్నారు వారి సన్నిహితులు.

ఇక సినిమాలలోకూడా వారు మంచి జంట అనిపించుకున్నారు. ఎప్పుడైతే ‘మనం’ సినిమాలో వారిరువురిని భార్య భర్తలుగా చూడగానే అప్పుడే అనుకున్నారు అభిమానులు అంత వాళ్ళు ముందు కూడా భార్య భర్తలు కాబోతున్నారు అని. పెళ్లి చేసుకోవడమే కాదు నన్ను మంచిగా చూసుకుంటున్నాడు అని  సమంత చాలా సార్లు మీడియా ముందు చెప్పింది.

అయితే ప్రస్తుతం వారి పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్న ఆ జంట. ఎవరి సినిమా బిజీ లో వాళ్ళు ఉన్నారు. నాగ చైతన్య నటించిన ‘వెంకీ మామ’ సినిమా దీపావళి కి విడుదల కాబోతుంది. సమంత కూడా ’96’ తమిళ సినిమా రీమేక్ తెలుగులో శర్వానంద్ తో కలిసి నటించబోతుంది. ఆ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వారికి ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి సినిమాలకి బెస్ట్ అఫ్ లక్ చెప్పేదాం.