స్పెయిన్ లో సమంతకు ఏం పని?

Samantha Akkineni
Samantha Akkineni

లేటెస్టుగా ఓ బేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. 30కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఓ ‘బేబీ’ చిత్రం బాక్సఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రంలో నాగశౌర్య స్పెషల్ అప్పీరియన్స్ గా నటించారు.

ఈ చిత్రం సక్సెస్ ని నాగచైతన్య, మరికొంతమంది స్నేహతులతో కల్సి ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సమంత. ప్రస్తుతం స్పెయిన్ లోని ఐబిజి ప్రాంతంలో వీరిరువురు విహార యాత్రలో మునిగితేలుతున్నారు. తన భర్త నాగచైతన్య తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. గ్లామరస్ గా, అందంగా వున్నసమంత ఫోటోలను చూసి ప్రతి ఒక్కరు వారెవ్వా.. అంటూ నోరు ఎ వెళ్లబెడుతున్నారు..!

ఇకపోతే నాగచైతన్య వెంకీ మావ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో హిట్ అయి’96’చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. శర్వానంద్ హీరో. 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది..!!

 

View this post on Instagram

 

@chayakkineni ❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Credit: Instagram