మరో వివాదంలో సమంత


Samantha in another controversy
సమంత అంటేనే వివాదాలు , ఈమధ్య అంతగా వివాదాలు లేవు అని అనుకుంటుండగా లేదు లేదు ఉంది అంటూ ఓ ట్వీట్ చేసి మరో వివాదానికి తెరలేపింది . అసలే మణికర్ణిక అనే చిత్రం పూర్తిగా వివాదంలో ఇరుక్కుంది . ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ . మన తెలుగువాడు అయితే కంగనా రనౌత్ తో క్రిష్ కు విబేధాలు వచ్చాయట దాంతో క్రిష్ ని ఘోరంగా చులకన చేసి మాట్లాడిందట అందుకే మణికర్ణిక నుండి తప్పుకున్నాడు.

 

కట్ చేస్తే క్రిష్ తీసిన సినిమాలో చాలా సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరించి దర్శకురాలిగా తన పేరుని వేసుకొని రిలీజ్ చేసింది . మణికర్ణిక చిత్రం యావరేజ్ గా నిలిచింది అయితే కంగనా రనౌత్ నటనకు మాత్రం జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . అసలే క్రిష్ కు కంగనా కు మధ్య గొడవ జరుగుతుంటే సమంత ఆ చిత్రాన్ని చూసి జాగ్రత్తగా కామెంట్ చేస్తే బాగుండేది కానీ అందుకు విరుద్దంగా నా హీరో కంగనా రనౌత్ అని చెప్పడమే కాకుండా నా మద్దతు కంగనా కే అంటూ ట్వీట్ చేసి క్రిష్ కు కోపం వచ్చేలా చేసి మరో వివాదానికి తెరలేపింది సమంత.

English Title: Samantha in another controversy