స‌మంత విష‌యంలో ఆ వార్త నిజం కాదా?స‌మంత విష‌యంలో ఆ వార్త నిజం కాదా?
స‌మంత విష‌యంలో ఆ వార్త నిజం కాదా?

ఫ్లాప్‌లు ఎదురైనా స‌మంత క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, బిగ్‌బాస్ సీజ‌న్ 4కు మామ నాగార్జున స్థానంలో స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుందంటూ గ‌త రెండు రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, స‌మంత బిగ్‌బాస్ సీజ‌న్ 4కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఫాల్స్ న్యూస్ అని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు కొట్టిపారేశారు.

బిగ్‌బాస్ తొలి సీజ‌న్‌కి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఆత‌రువాత సీజ‌న్ 2కు నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా త‌న‌దైన మార్కుతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక సీజ‌న్ 3ని అక్కినేని నాగార్జున త‌న‌దైన కామెంట్స్‌తో హుషారెత్తించిన విష‌యం తెలిసిందే. ఈ సీజ‌న్‌కి సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలిచాడు.

ఇదిలా వుంటే సీజ‌న్ 4ని ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే ముగ్గురు కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేసిన మేక‌ర్స్ దీనికి హోస్ట్‌గా మ‌ళ్లీ నాగార్జుననే ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆగ‌స్టు నుంచి సీజ‌న్ 4ని ప్రారంభించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.