
సమంత, నాగ చైతన్య ఒకిరిపై ఒకరికి వున్న ప్రేమను వెల్లడించడానికి మొహమాట పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుండే ఈ జంట నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి పోస్ట్‌తో మరోసారి సామ్, చై వార్తల్లో నిలిచారు.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కయ్యుల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ `లవ్‌స్టోరీ`లో నటిస్తున్నారు నాగచైతన్య ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తియింది. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ మూవీ తరువాత నాగచైతన్య `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో వుంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఆన్ ద సెట్స్‌కి సంబంధించిన క్యాండిడ్ పిక్చర్‌ని చై షేర్ చేశారు. దీనికి ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ని జత చేశారు. పీసీ శ్రీరామ్‌తో కలిసి వర్క్ చేయడం ఓ మధురమైన అనుభూతి. నాకు లభించిన ఆశీర్వాదం అంటూ పీసీ శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఫొటోపై సమంత కామెంట్ చేసింది. నాగచైతన్య సెట్లో నీరిక్షిస్తున్న ఫొటోని ట్యాగ్ చేస్తూ ` “మీరు నా గురించి ఆలోచిస్తున్నారా?” ప్రేమ ఎమోజీతో సామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Samantha Akkineni (@Samanthaprabhu2) January 17, 2021