సమంత ఎందుకు ఏడ్చిందో తెలుసా ?


samantha-nagachaitanya-majili
సమంత దాదాపు అరగంట కు పైగా ఏడ్చిందట ! సమంత అలా ఎందుకు ఏడుస్తుందో తెలియక తన కుక్క అటు ఇటు తిరుగుతూ పిచ్చిదానిలా చూసిందట ! ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించడం విశేషం . ఇంతకీ సమంత ఏడ్చింది ఎందుకో తెలుసా ……. భర్త నాగచైతన్య కోసం , అతడు సక్సెస్ కోసం . ఒకవైపు సమంత వరుస విజయాలు సాధిస్తుంటే నాగచైతన్య మాత్రం వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు . 
 
దాంతో మజిలీ తప్పకుండా హిట్ కావాలని తిరుమలకు కాలినడకన వెళ్ళింది తిరుమల శ్రీవారిని వేడుకుంది . కట్ చేస్తే మజిలీ రిలీజ్ అయ్యింది హిట్ టాక్ తెచ్చుకుంది దాంతో అది నిజమా ? లేదా ? అనే సంశయంలో కన్నీళ్ల పర్యంతం అయ్యిందట . సినిమాకు హిట్ టాక్ యునానిమస్ గా రావడంతో ఇక అరగంట కు పైగా ఏడుస్తూనే ఉందట . 
 
సమంత ఏడ్చింది అయితే మొదట సక్సెస్ కోసం , ఆ తర్వాత సక్సెస్ అయిన ఆనందంలో సుమా ! భర్త విజయం సాధిస్తేనే కదా ! భార్యకు మరింత ఆనందం అందుకే నాకు మంచి భార్య దొరికింది అంటూ నాగచైతన్య ఆనందాన్ని వ్యక్తం చేసాడు మజిలీ సక్సెస్ మీట్ లో .