స‌మంత అంత డిమాండ్ చేసిందా?


స‌మంత అంత డిమాండ్ చేసిందా?
స‌మంత అంత డిమాండ్ చేసిందా?

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో స‌మంత‌కు మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే సామ్ రెమ్యున‌రేష‌న్‌ని భారీగానే డిమాండ్ చేస్తోంది. ప్ర‌స్తుతం హిందీ పాపుల‌ర్ వెబ్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్ 2`లో న‌టించిన స‌మంత తాజాగా మ‌రో సినిమాని అంగీక‌రించ‌లేదు కానీ `ఆహా` ఓటీటీ కోసం ప్లాన్ చేసిన `సామ్ జామ్‌`కు గ్రీన్ సిగ్న‌లిచ్చింది.

దీంతో సామ్ ఏంటీ టాక్ షోకి ఓకే చెప్పింద‌ని అంతా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ మొద‌లైంది. ఆ త‌రువాత రానా, నాగ్ అశ్విన్‌, సైనా నెహ్వాల్‌..ల‌కు సంబంధించిన ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఇటీవ‌ల త‌మ‌న్నా, ర‌కుల్‌, క్రిష్‌, త్వ‌ర‌లో అల్లు అర్జున్‌, మెగాస్టార్ చిరంజీవిల కు సంబంధించిన ఎపిసోడ్స్ త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇదిలా వుంటే ఈ టాక్ షో కోసం సామ్ కోటీ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఎనిమిది ఎపిసోడ్‌ల‌కు మాత్ర‌మే ఈ పారితోషికం అని తెలిసింది. దీంతో కేవ‌లం ఎనిమిది ఎపిసోడ్‌ల‌కి సామ్ కోటి వ‌సూలు చేసిందా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. న‌మ‌న‌తార‌తో క‌లిసి స‌మంత ఓ భారీ ఉమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తోంద‌ని, అందులో సామ్ పాత్ర‌కు మించి న‌య‌న పాత్ర వుంటుంద‌ని ఆ కార‌ణంగానే సామ్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుందని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై స‌మంత స్పందించాల్సి వుంది.