అర్జున్ రెడ్డి డైరెక్టర్ ని తప్పుపట్టిన సమంతsamantha sandeep reddy vanga
samantha and sandeep reddy vanga

అర్జున్ రెడ్డి దర్శకుడ్ని తప్పుపట్టింది సమంత , అయితే అర్జున్ రెడ్డి చిత్రం నాకు నచ్చిందని అంటోంది . ఇంతకీ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్న మాటలు ఏంటి ? సమంత ఎందుకు అభ్యంతరం చెప్పిందో తెలుసా …… ఒక అమ్మాయి , ఒక అబ్బాయి బాగా ప్రేమించుకున్నప్పుడు తప్పకుండా ముట్టుకోవడం కొట్టుకోవడం కామన్ , ఒకవేళ అలా చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదు అంటూ సందీప్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడమే !

సందీప్ రెడ్డి వంగా స్టేట్ మెంట్ సమంత కు నచ్చలేదు అందుకే సందీప్ రెడ్డి వంగా వ్యాఖ్యలతో విబేధిస్తునట్లు ట్వీట్ చేసింది . అర్జున్ రెడ్డి చిత్రం నచ్చింది కానీ రిలేషన్ లో ఉన్నాం కదా అని అమ్మాయిని అబ్బాయి కొట్టడం తప్పు అని అంటోంది అంతేకాదు సందీప్ రెడ్డి అభిప్రాయం తప్పని అంటోంది .అర్జున్ రెడ్డి తెలుగులో సంచలనం సృష్టించడంతో హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే . అయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కానీ అంతకంటే ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి .