రానా పెళ్లిలో స‌మంత హంగామా! 

Samantha Dress Cost Will Shock everyone
Samantha Dress Cost Will Shock everyone

ద‌గ్గుబాటి రానా ఈ రోజుతో బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పేస్తున్నాడు. ఎంత కాలంగా ప్రేమిస్తున్న గ‌ర్ల‌ఫ్రెండ్ మిహీకా బ‌జాజ్‌ని వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకుంటున్నారు. ఇందు కోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. ఇక పెళ్లి బాజాల‌దే ఆల‌స్యం వేద మంత్రాల సాక్షిగా వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఇదిలా వుంటే రానా పెళ్లిలో స‌మంత హంగామా ఎక్కువైంద‌ట‌.

రానా – మిహీకాల పెళ్లి కోసం ప్ర‌త్యేకంగా స‌మంత ఓ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుంది. ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుంది. ప్ర‌స్తుతం ఈ డ్రెస్‌లో స‌మంత క‌నిపిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రానా పెళ్లికి సామ్ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారింద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. ఈ డ్రెస్‌ని ప్ర‌ముఖ డిజైన‌ర్ అర్పిత మెహ‌తా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ఖ‌ర్చు అక్ష‌రాలా 59 వేలుగా చెబుతున్నారు.

పెళ్లికి ముందు జ‌రిగిన హ‌ల్దీ, మెహందీ వేడుక‌ల్లో స‌మంత ఈ డ్రెస్‌లో సంద‌డి చేసింది. ఈ రోజే పెళ్లి కావ‌డంతో పెళ్లిలో సామ్ ఎలాంటి డ్రెస్‌తో హంగామా చేస్తుందోన‌ని అంతా ఎదురుచూస్తున్నారు. రానా, మిహీకాల వెడ్డింగ్‌లో కొత్త డిజైన్ డ్రెస్‌లో స‌మంత‌ ఏ రేంజ్‌లో హంగామా చేస్తుందో చూడాలి.