సమంత ఫ్యాన్ ని కొట్టిన పోలీసులు


samantha fan beaten by police

ఒక్కోసారి అభిమానం మితి మీరినప్పుడు లాఠీ దెబ్బలు చవి చూడాల్సి ఉంటుంది , సమంత పై ఉన్న అభిమానంతో ఓ అభిమాని ఆమెని దగ్గరగా చూడాలని ఉత్సాహపడిన ఘటనలో పోలీసులు లాఠీ దెబ్బలతో ఘన సన్మానం చేసారు , ఈ సంచలన సంఘటన అనంతపురంలో జరిగింది . ఓ షాప్ ప్రారంభోత్సవానికి సమంత అనంతపురం వచ్చింది , కాగా సమంత వస్తున్న విషయం అనంతపురం జిల్లా ప్రజలకు తెలియడంతో ఆమెని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు .

 

అయితే అందులో ఒక అభిమాని గుంపు లోంచి వేగంగా సమంత వైపు దూసుకు రావడంతో అప్రమత్తమైన పోలీసులు అతడు దాడి చేయడానికి వస్తున్నాడేమో అని భ్రమించి పిచ్చి కొట్టుడు కొట్టారు . ఆ ఒక్క అభిమాని ని మాత్రమే కాదు పెద్ద ఎత్తున యువత సమంత వైపు దూసుకు వస్తుండటంతో వాళ్ళని అదుపు చేయడానికి లాఠీ లకు పని చెప్పారు పోలీసులు . తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో అప్రమత్తమైన సమంత వెంటనే కార్యక్రమాన్ని ముగించుకొని హైదరాబాద్ వచ్చేసింది .