థియేట‌ర్‌లోనే క‌ళ్లు మూసిన స‌మంత అభిమాని!

థియేట‌ర్‌లోనే క‌ళ్లు మూసిన స‌మంత అభిమాని!
థియేట‌ర్‌లోనే క‌ళ్లు మూసిన స‌మంత అభిమాని!

త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా త‌మిళంలో రూపొందిన చిత్రం `96`. సి. ప్రేమ్‌కుమార్ తెర‌కెక్కించిన ఈ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేమికుల అభినంద‌న‌ల్ని కూడా ద‌క్కించుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి ఇందులో న‌టించిన త్రిష‌. విజయ్ సేతుప‌తిల‌కు ప‌లు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. క‌న్న‌డతో రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దిల్ రాజు `జాను` పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.

స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలి రోజు సెన్సిబుల్ హార్ట్ ట‌చ్చింగ్ ల‌వ్‌స్టోరీగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న ఈ సినిమా తాజాగా వార్త‌ల్లో నిలిచింది. ఈ చిత్రాన్ని హైద‌రాబాద్ న‌గ‌రంలోని గోకుల్ థియేట‌ర్‌లో సినిమా చూడ‌టానికి వెళ్లిన సామ్ అభిమాని థియేట‌ర్‌లోనే మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

శుక్ర‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ధ్యాహ్నం షో పూర్తియిపోయి అంతా బ‌య‌టికి లేచి వెళ్లిపోతున్నా ఓ వ్య‌క్తి మాత్రం అలాగే కుర్చీలో అచేత‌నంగా ప‌డి వుండ‌టాన్నిథియేట‌ర్ సిబ్బంది గ‌మ‌నించి వెళ్లి చూస్తే అత‌ను మ‌ర‌ణించిన‌ట్టు తెలిసింది. వెంట‌నే అత‌న్ని బ‌య‌టికి తీసుకొచ్చిన థియేట‌ర్ సిబ్బంది ఎస్‌.ఆర్ న‌గ‌ర్ పీఎస్‌కు స‌మాచారం అందించార‌ట‌. విష‌యం తెలుసుకున్న పోలీసులు అత‌ని మృతిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిసింది.