బూతులు తిడతారని సమంత భయపడిందట


Samantha feared with super deluxe role

సూపర్ డీలక్స్ చిత్రంలో నటించినందుకు గాను నన్ను అందరూ బూతులు తిడతారని భయపడిందట సమంత అయితే నన్ను కాకుండా నా పాత్రని మాత్రమే చూసారు కాబట్టి ప్రశంసలు లభిస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత . తాజాగా ఈ భామ నటించిన సూపర్ డీలక్స్ చిత్రం తమిళనాట రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది దాంతో సమంత చాలా సంతోషంగా ఉంది .

 

ఇక ఈ భామ తెలుగులో నటించిన ” మజిలీ ” చిత్రం ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది . నాగచైతన్య – సమంత పెళ్లి అయ్యాక కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మొదలయ్యింది . ఇక సమంత కూడా ఈగర్ గా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది . మజిలీ చిత్రం చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది సమంత .

English Title : Samantha feared with super deluxe role