
హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రమాద స్థాయిలో విజృంభిస్తోంది. ఎప్పుడు ఎవరికి పాజిటివ్ వస్తుందో అని సామాన్య జనంతో పాటు స్టార్స్, పొలిటికల్ లీడగర్స్ భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన నిర్మాత బండ్ల గణేష్ కు పాజిటివ్ రావడం భయాందోళనకు గురిచేస్తోంది.
దీంతో టాలీవుడ్ తారలు కూడా భయపడుతున్నారు. ఇదిలా వుంటే బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ సోదరి శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో సమంత అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైన్‌గా శిల్పారెడ్డికి మంచి పేరుంది. హీరోయిన్ సమంత ఆమెని అత్యంత ఆప్తురాలిగా భావిస్తూ వుంటుంది. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా మంచి అనుబంధం ఏర్పడింది.
అయితే గత రెండు రోజుల క్రితం శిల్పారెడ్డిని కలిసిన సమంత ఆమెని కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టిందట. ఇటీవల శిల్పారెడ్డి అనారోగ్యంతో బాధపడుతోందని తెలిసి పరీక్షలు చేయించగా ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆమెకు పాజిటివ్ అని తేలడంతో ఆమెకు ముద్దు పెట్టిన మా అభిమాన నటి సమంత పరిస్థితి ఏంటని అక్కినేని అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. సమంతకు అత్యంత సన్నిహితంగా వుండే శిల్పారెడ్డికి కరోనా సోకడంతో సమంత పరిస్థితి ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. సమంత కూడా వైరస్ టెస్టులు చేయించుకుంటే మంచిదని ఫ్యాన్స్ చెబుతున్నారు.