స‌మంత ఓకే చెప్పిన రెండు చిత్రాలు అవేనా?

స‌మంత ఓకే చెప్పిన రెండు చిత్రాలు అవేనా?
స‌మంత ఓకే చెప్పిన రెండు చిత్రాలు అవేనా?

త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన చిత్రం `జాను`. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెట్టుకున్న స‌మంత‌కు నిరాశ‌నే మిగిల్చింది. ‌విమ‌ర్శ‌కులు సైతం స‌మంత ఈ చిత్రం చేయాల్సింది కాదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో కొన్ని రోజులు సైలెంట్‌గా వున్న సామ్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఆ రెండు చిత్రాలు కూడా మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు కావ‌డం గ‌మ‌నార్హం. తాప్సీతో `గేమ్ ఓవ‌ర్‌` చిత్రాన్ని రూపొందించి విజ‌యాన్ని సొంతం చేసుకున్న అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని, న‌య‌న‌తార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని స‌మంత అంగీక‌రించింది. అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ రూపొందించ‌నున్న చిత్రాన్ని ప్ర‌ముఖ సోనీ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. పాన్ ఇండియా స్థాయిలో మ‌హిళా ప్ర‌ధాన చిత్రంగా ఈ సినిమాని రూపొందించ‌నున్నారు.

ఇక విగ్నేష్ శివ‌న్ డైరెక్ట్ చేయ‌నున్న చిత్రం మ‌రొక‌టి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్వి భాషా చిత్రంగా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇందులో స‌మంత‌తో పాటు న‌య‌న‌తార కూడా న‌టించ‌నుంది. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ చిత్రం ప్రారంభం కానున్న‌ట్టు చెబుతున్నారు.