స‌మంత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఆమెకేనా?స‌మంత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఆమెకేనా?
స‌మంత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఆమెకేనా?

ఇన్‌స్టాహ్యా‌క‌ర్స్ పేరుతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మే జ‌రుగుతోంది. స‌మంత‌పై పూజా హెగ్డే ఇన్‌స్టా పేజ్‌లో కించ‌ప‌రుస్తూ ఓ కాంమెంట్ షేర్ కావ‌డం, అది త‌ను పెట్ట‌లేద‌ని, హ్యాక‌ర్స్ చేసిన ప‌ని అంటూ పూజా హేగ్డే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. గంట వ్య‌వ‌ధిలో అకౌంట్‌ని తిరిగి పొంద‌డం అంత సులువేమీ కాద‌ని సామ్ బృందం వాదిస్తూ పూజా హెగ్డేని ట్రోల్ చేస్తోంది.

పూజ మాత్రం త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని, ఆ వ్యాఖ్య‌లు తాను చేయ‌లేద‌ని చెబుతోంది. స‌మంత మాత్రం ప్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం పూజా వ్యాఖ్య‌ల ప‌ట్ల మీ స్పంద‌న ఏంటని అడుగుతున్నారు. దీనిపై తాజాగా సామ్ స్పందించింది. కొంత మంది మంచి త‌నాన్ని కూడా చేత‌గాని త‌నంగా భావిస్తార‌ని ఇండైరెక్ట్‌గా పంచ్ వేసింది.

గ‌త మూడు రోజులుగా స‌మంత ఫ్యాన్స్ పూజా హెగ్డేని సోష‌ల్ మీడియా వేదికా ట్రోల్ చేస్తూనే వున్నారు. స‌మంత‌కు సారీ చెప్న‌మ‌ని హ్యాష్ ట్యాగ్‌ల‌తో ర‌చ్చ చేస్తున్నారు. అయితే ఇద్ద‌రు హీరోయిన్ల వాల‌కం చూస్తుంటే ఈ రచ్చ ఇప్ప‌ట్లో స‌ద్ద‌మ‌నిగేలా క‌నిపించ‌డం లేద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.