పివి సింధు బయోపిక్ లో ఆ స్టార్ హీరోయిన్ నటిస్తోందా!Samantha-To-Play-As-Pv-Sindhu
Samantha-To-Play-As-Pv-Sindhu

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బయోపిక్ రాబోతుందని కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి తెరదించుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ పివి సింధు బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.

తాజాగా పివి సింధు ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇండియాకి తొలి స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పివి సింధు చరిత్ర సృష్టించింది. అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నాడు సోనూసూద్. ఇక పివి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకమైంది. ఈ క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ నటించనున్నాడని సమాచారం..

ముక్యంగా పివి సింధు పాత్రలో ఎవరు నటించనున్నారనే దానికి తెరపడింది. ఈ పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుందని.. ఆమె అయితేనే పివి సింధు క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేయగలదు అని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత స్పెయిన్ లో ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాగానే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని వినికిడి. శర్వానంద్ తో 96 అనే మూవీ చేస్తుంది సమంత.. ఈ చిత్రం ఫినిష్ అవగానే పివి సింధు బయోపిక్ చేస్తారని తెలిసింది. మరి ఈ ప్రచారంపై ఎంతవరకు నిజంవుందో తెలియాల్సివుంది.

ఈ విషయంపై పుల్లెల గోపీచంద్ తెలియజేస్తూ.. అక్షయ్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాత్ర చేయడం నాకు ఎంతో సంతోషంగా వుంది. ఆయనైతే చాలా అద్భుతంగా చేస్తారు.. అన్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో చిత్రీకరించాడని ప్లాన్ చేస్తున్నారు.. !!