సమంత తల్లి కాబోతోందా ?


Samantha
Samantha

సమంత గర్భం దాల్చినట్లు , తల్లి కాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దానికి ఊతమిచ్చేలా సమంత కొత్త సినిమా ఇంతవరకు ప్రకటించలేదు . అలాగే ఓ బేబీ సూపర్ హిట్ అయినప్పటికీ మరో సినిమా ఏది ప్రకటించకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపొచ్చింది ఇంకేముంది సమంత గర్భం దాల్చింది అందుకే సినిమాలను అంగీకరించడం లేదు అని అంటున్నారు .

ఒకవేళ సమంత గర్భం దాల్చితే ఏడాదిన్నరకు పైగా సినిమాలకు దూరం అవ్వడం ఖాయం . ఆ తర్వాత మాత్రమే సినిమాల్లో నటించనుంది అని అంటున్నారు . ఓ బేబీ సంచలన విజయం సాధించడంతో సమంత పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇకపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయడం ఖాయమని అంటున్నారు . అయితే ఈ ఊహాగానాలపై సమంత స్పందిస్తేనే ఓ కొలిక్కి వచ్చే అంశం మరి ఇది .