`జాను` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!



`జాను` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!
`జాను` రిలీజ్ డేట్ లాక్ చేసేశారుగా!

త‌మిళంలో త్రిష‌, విజ‌య్ సేతుపతి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన `96` అక్క‌డ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల‌ని సైతం మెప్పించి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. న‌టిగా త్రిష అభిన‌యానికి గానూ ఏకంగా 11 అవార్డుల్ని అందించింది.

ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా న‌టిస్తున్నారు. త‌మిళ మాతృక‌ని తెర‌కెక్కించిన సి. ప్రేమ్‌కుమార్ ఈ రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. టీజ‌ర్‌లో శర్వాను ఉద్దేశించి స‌మంత చెప్పిన డైలాగ్‌లు ప్రేమికుల్ని హంట్ చేస్తున్నాయి.

మాతృక‌ని మించి హృద్య‌మైన భావోద్వేగాల నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల నెల అయిన ఫిబ్ర‌వ‌రిలో 7వ లేదీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది. కొత్త త‌ర‌హా క‌థ‌తో 96 బ్యాచ్ స్నేహితుల రీ యూనియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళ మాతృక‌ని మించి సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డం ఖాయం అని చిత్ర బృందం ధీమాని వ్య‌క్తం చేస్తోంది.