సామ్ గ్లామ‌ర్ డోస్‌తో రెచ్చిపోయిందిగా!


సామ్ గ్లామ‌ర్ డోస్‌తో రెచ్చిపోయిందిగా!
సామ్ గ్లామ‌ర్ డోస్‌తో రెచ్చిపోయిందిగా!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ల‌లో స‌మంత సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ప్ర‌తీ విష‌యాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సామాజిక అంశాల ప‌ట్ల కూడా త‌న పాత్ర‌ని పోషిస్తూ వుంటుంది సామ్. లాక్‌డౌన్ కి బిఫోర్ నుంచి త‌న డీపీని మార్చ‌ని సామ్ తాజాగా మార్చేసింది. ప్ర‌ముఖ స్టిల్ ఫొటో గ్రాఫ‌ర్ జి. వెంక‌ట‌రామ‌న్  ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ర‌వివ‌ర్మ చిత్రాల పునఃసృష్టి ఫోటో షూట్‌లో గ్రామీణ యువ‌తిగా క‌నిపించి ఆక‌ట్టుకున్న స‌మంత ఇంత కాలం ఆ ఫొటోనే త‌న డీపీగా కంటిన్యూ చేసింది.

తాజాగా త‌న డీపీని మార్చేసింది. లైట్ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో సామ్ మెరిసి పోయింది. ఇటీవ‌లే ఏకం పేరుతో డిజైన‌ర్ డ్రెస్‌ల బ్రాండ్‌ని ప్రారంభించిన స‌మంత త‌న కోసం ప్ర‌త్యేకంగా భుజాలు క‌నిపించేలా డిజైన్ చేసి డ్రెస్‌ని ధ‌రించి హోయ‌లు పోయింది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

బ్లాక్ అండ్ వైట్ సిరీస్ పేరుతో స‌మంత షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్  చేస్తున్నాయి. పెళ్లైనా స‌మంత‌లో హాట్ నెస్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ డ్రెస్‌లో సామ్ గ్లామ‌ర్ డోస్ పెంచేసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత ఇటీవ‌లే `ఫ్యామిలీమ్యాన్ 2` వెబ్ సిరీస్ కోసం డ‌బ్బింగ్ పూర్తి చేసింది. త‌ను ప్రారంభించిన ఏకం డ్రెస్ బ్రాండ్ కోసం ఓ యాడ్ ఫిల్మ్ లో కూడా న‌టించింది. మ‌రి షూటింగ్ కోసం ఏ సెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తుందో చూడాలి.