లాక్‌డౌన్ వేళ స‌మంత స‌రికొత్త‌ పాఠాలు!


లాక్‌డౌన్ వేళ స‌మంత స‌రికొత్త‌ పాఠాలు!
లాక్‌డౌన్ వేళ స‌మంత స‌రికొత్త‌ పాఠాలు!

నిత్యం వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్న సినీ తార‌లు క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో ఇంటికే ప‌రిమితం అయిపోయారుజ జ‌న జీవితం స్థంభించిపోవ‌డంతో సినిమాల‌కు సంబంధించిన షూటింగ్‌లు కూడా భారీ స్థాయిలో ఆగిపోయాయి. దీంతో స్టార్స్‌కి ప‌నిలేకుండా పోయింది. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌రువాతే సినిమా షూటింగ్‌లకు అనుమ‌తి ఇవ్వ‌డం అనేది జ‌రుగుతుంది కాబ‌ట్టి అప్ప‌టి వ‌ర‌కు స్టార్స్ అంతా ఇంటిప‌ట్టునే వుండాల్సిన ప‌రిస్థితి.

దీంతో ఈ  విలువైన స‌మ‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు.  కొంత మంది వ‌ర్క‌వుట్‌లు చేస్తుంటే కొంత మంది వెరైటీ ఛాలెంజ్‌లు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. స‌మంత మాత్రం స‌రికొత్త పాఠాల‌కు ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని కేటాయిస్తోంది. త‌న యాక్టింగ్ స్కిల్స్‌ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆన్‌లైన్‌లో యాక్టింగ్ క్లాసులు నేర్చుకుంటోంది.

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌మంత ఆన్‌లైన్‌లో హెలెన్ మెరీన్ నుంచి యాక్టింగ్ క్లాసులు నేర్చుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో ఓ ఫొటోని షేర్ చేసింది. ఈ లాక్‌డౌన్ పూర్త‌య్యేలోపు తాను బెట‌ర్ యాక్ట‌ర్‌ని అవుతాన‌‌ని, అంత వ‌ర‌కు ఎదురుచూడండి `అని కామెంట్ పెట్టింది.