అఖిల్ పెళ్లికి మీడియేట‌ర్‌గా స్టార్ హీరోయిన్‌?


అఖిల్ పెళ్లికి మీడియేట‌ర్‌గా స్టార్ హీరోయిన్‌?
అఖిల్ పెళ్లికి మీడియేట‌ర్‌గా స్టార్ హీరోయిన్‌?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అఖిల్ అక్కినేని పెళ్లి ప్ర‌య‌త్నాల్లో వున్నారా? .. అత‌ని పెళ్లికి స్టార్ హీరోయిన్ పెళ్లి పెద్ద‌గా మారుతోందా? అంటే టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏ నోట విన్నా ఇండస్ట్రీలో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఓ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ కూతుర్ని అఖిల్ వివాహం చేసుకోబోతున్నారని ఇందుకు సంబంధించి స్టార్ హీరోయ‌న్ మ‌ధ్య వ‌ర్తిత్వం నెరుపుతోంద‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ అఖిల్ పెళ్లికి మ‌ధ్య వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది మ‌రెవ‌రో కాదండోయ్ స్వ‌యాన అఖిల్ వ‌దిన‌గారు స‌మంత‌నే అని గుస గుస‌లు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాల‌కు మ‌ధ్య స‌మంత సంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే మ‌రిది గారి పెళ్లికి లైన్ క్లియ‌ర్ చేస్తోంద‌ని చెప్పుకుంటున్నారు. ఇరు కుటుంబాల మ‌ధ్య చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మై గ్రీన్ సిగ్నిల్ ప‌డితే అఖిల్ పెళ్లికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేన‌ని, త్వ‌ర‌లోనే శుభ‌వార్త‌ని బ‌య‌టికి వెల్ల‌డించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని టాక్‌.

జీవీకే గ్రాండ్ డాట‌ర్ శ్రియా భూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇట‌లీలో వివాహం అని ప్ర‌చారం జ‌రిగింది కూడా ఇంత‌లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఎంగేజ్‌మెంట్ ద‌శ‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వివాహాన్ని ర‌ద్దు చేసుకున్నారు. శ్రియా భూపాల్ వెంట‌నే రామ్‌చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న బంధువుని పెళ్లాడి సెటిలైపోయిన విష‌యం తెలిసిందే.