సమంత ఒక్కటే నిజం కాదుగా నిర్వాణ

Samantha missing in Nani Shiva Nirwana Tuck Jagadeesh
Samantha missing in Nani Shiva Nirwana Tuck Jagadeesh

శివ నిర్వాణ.. దర్శకుడిగా చేసినవి రెండు సినిమాలే అయినా ప్రేక్షకులపై తన సినిమాలతో బలమైన ముద్రే వేసాడు. నిన్ను కోరి, మజిలీ ఈ రెండు కూడా ప్రేమ కథల్లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇప్పుడు తన మూడో సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే కొన్ని రోజుల క్రితం శివ నిర్వాణకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. నాని, సమంత జోడిగా శివ నిర్వాణ, మజిలీ సినిమాను తెరకెక్కించిన షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడన్నది ఆ న్యూస్. అయితే దీనిపై శివ నిర్వాణ ఎందుకో హర్ట్ అయ్యాడు. తన సినిమా విషయాలు తను చెబితే తప్పితే ఎవరూ నమ్మకండి అంటూ ఒక ట్వీట్ వేసాడు.

నిజానికి నాని, సమంత కాంబినేషన్ అనగానే అందరూ ఎగ్జైట్ అయ్యారు. ఇద్దరూ న్యాచురల్ యాక్టర్స్. పైగా ఇద్దరి కాంబినేషన్ హిట్. వీరిద్దరూ కలిసి చేసిన ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు.. ఈ రెండు సినిమాలూ కూడా మంచి పేరే తీసుకొచ్చాయి. కానీ ఈ వార్త ఉట్టిదే అని తేలిపోయింది. నిన్న శివ నిర్వాణ సినిమా గురించి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చింది. ఆ రూమర్ లో ఉన్నట్లే నాని హీరోగా టక్ జగదీష్ అనే వినూత్న టైటిల్ తో సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఆ రూమర్ లో ఉన్నట్లుగానే షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా అన్ని విషయాల్లో ఓకే కానీ హీరోయిన్ విషయంలో మాత్రం ఆ రూమర్ తప్పయింది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. మరి సమంతను అప్రోచ్ అయ్యాక ఆమె వద్దందా, వీళ్ళు వద్దనుకున్నారా, అసలు సమంతనే అప్రోచ్ అవ్వలేదా అన్న విషయంలో క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాలో అందరినీ ఆకర్షించింది థమన్ పేరు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. శివ నిర్వాణ తొలి రెండు సినిమాలకు గోపి సుందర్ సంగీతం అందించాడు. అయితే మజిలీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆలస్యం చేయడంతో శివ నిర్వాణ, గోపి సుందర్ మధ్య వివాదం తలెత్తింది. దాంతో థమన్ తో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయించుకున్నాడు. థమన్ సకాలంలో స్పందించి సరైన ఔట్పుట్ ఇవ్వడంతో తన తర్వాతి సినిమాకు థమన్ నే ఎంచుకున్నాడు శివ నిర్వాణ.

నాని, థమన్ ఎప్పటినుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటివరకూ కలిసి చేయకపోవడం నిజంగా విడ్డూరమే.