మ‌ళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమానే!మ‌ళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమానే!
మ‌ళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమానే!

క‌మ‌ర్ష‌య‌ల్ క‌థానాయిక‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు స‌మంత‌. `రాజుగారి గ‌ది 2` నుంచి ఆమె త‌న పంథా మార్చుకున్నారు. క‌థానాయిక‌గా ప్రాధాన్యం వున్న చిత్రాల్లో మాత్ర‌మే న‌టించ‌డం మొద‌లుపెట్టారు. యు ట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, ఓ బేబీ వంటి చిత్రాలు సూప‌ర్‌హిట్ కావ‌డంతో ఈ త‌ర‌హా ఇత్రాల‌కే ప్రాధాన్య‌త నివ్వ‌డం మొద‌లుపెట్టింది.

ఇటీవ‌ల త‌మిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందిన `జాను`లో న‌టించిన స‌మంత త్వ‌ర‌లో మ‌రో మ‌హిళా ప్ర‌ధాన చిత్రంలో న‌టించ‌బోతోంది. క‌న్న‌డ హిట్ ఫిల్మ్ `దియా` ఆధారంగా ఈ చిత్రం రూపొందే అవ‌కాశం వుంద‌ని, ఈ చిత్రంపై స‌మంత ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ‌

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు మైత్ర ఆఫీసులో జ‌రుగుతున్నాయ‌ట‌. మేక‌ర్స్ ఫ్రెష్ స్టోరీతో వెళ‌తారా?  లేక స‌మంత‌కు న‌చ్చిన `దియా`ని రీమేక్ చేస్తారా అన్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. దీనిపై ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే దీనిపై ఓ ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలిసింది.